యేడిదోడి షష్ఠిపూర్తి

398
0
Submitted Date 11/04/2022
Bookmark

శాస్త్రి రామనాథ యేడిదోడు

నాగమణినాధుడు స్నేహప్రియుడు

జరుగ షష్టిపూర్తి తనకు నేడు

చిననాటి నేస్తాల జ్ఞప్తి వినుడు.

 

నాడు కొలిచె వాడు

తల్లి శారదను

చెంత చేరె లక్ష్మి

నేడు యేడిదిని.

 

నాడు ఓనమాలు

పాకబడి చాటు

కూర్చె 'కామధేను'

వేదసభ నేడు.

 

ఆనాటి అక్కాలు

లాంతరు వడిన

ఈనాటి ఇక్కీలు

'నవనిధి' బడిన.

 

'వేమవరం' నాటి

ఆలాపన నేటి

'నల్లకుంట' లలిత

సంగీత లహరి.

 

పిల్లకాలువ దాట

చిననాటి దాయీత

పెదకాలువ దాట

ఈనాటి చేయూత.

 

వీడె కోనసీమ

పెద్ద చదువులకు

నేడు పెట్టె స్కూలు

చిన్న తమ్ములకు.

 

ఎదిగినా యేడిదీ

ఒదిగి వున్నావయా

ఎదిగెదిగి మిత్రమా

మా మనసు నింపుమా.

 

జీవార్థము తోడ

పరమార్ధ మెరిగిన

యేడిదీ పండించు

నూరేళ్ల పంట.

----------------

ఈ 'యేడిదోడి షష్ఠిపూర్తి'' బాల్యనేస్తం యేడిద రామనాథ శాస్త్రి అసమాన జీవితవృత్తాంతం.

దురదృష్ట వశాత్తూ కరోనా రెండవ విడత "దాత" యేడిద రామనాథ శాస్త్రిని 74వ ఏట కబళించి అతని 'నవనిధి ఎలక్ట్రానిక్స్' ని అనాధ చేయడమే కాక ఎన్నో విద్యా, సాంస్కృతిక, ఆధ్యాత్మిక మరియు దాతృత్వ వ్యవస్థల పెద చేయి నరికింది.

Novelist, playwright, short story, non-fiction and articles writer, translator in verses, a little thinker and a budding philosopher of Addendum of Evolution - Origins of the World

Comments

Please login to post comments on this story